Sep 24,2023 21:51

ఫొటో : వైద్యం నిర్వహిస్తున్న డాకర్‌

ఉచిత వైద్య శిబిరం జయప్రదం
ప్రజాశక్తి-కావలి : సంయుక్త సేవాసంస్థ ఆధ్వర్యంలో కావలి ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ కావలి రవి నర్సింగ్‌ హోమ్‌, ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ కావలి, జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రం నెల్లూరు, శ్రీ శ్రీనివాస జూనియర్‌ కాలేజీ వారి సహకారంతో నిర్వహించిన వైద్య శిబిరం జయప్రదమైంది. జి.వంశీ, బి.శ్రీనాధ్‌, జి.హజరత్‌, ఐ.శివ రఘునాధ్‌, బి.భాగ్యరాజ్‌, జి.అనీల్‌ కుమార్‌, ఎన్‌.నరేష్‌, ఎమ్‌.సుజన్‌, టి.శివకుమార్‌, ఎమ్‌.క్రిష్ణ కిశోర్‌ల దాతృత్వంతో శ్రీనివాస జూనియర్‌ కళాశాలలో వైద్య శిబిరాన్ని డాక్టర్‌.పి.శివ ప్రసాద్‌, డాక్టర్‌ సుధీర్‌ కుమార్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్‌ పి శివప్రసాద్‌, డాక్టర్‌ సుధీర్‌ కుమార్‌ రెడ్డి, డాక్టర్‌ ఎం.ఉమాచంద్‌ పాల్గొని వైద్య సేవలు అందించారు.
ఈ వైద్య శిబిరంలో సంయుక్త సేవాసంస్థ గౌరవ అధ్యక్షులు డాక్టర్‌ బెజవాడ రవికుమార్‌, శ్రీ శ్రీనివాస జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ కె.కోటేశ్వరరావు, మాలకొండయ్య, సంస్థ సభ్యులు ఎమ్‌ అజిత్‌ బాబు, నేలటూరి శివప్రసాద్‌ రెడ్డి, వివిధ స్వచ్చంద సంస్థల గౌరవ అధ్యక్షుడు షేక్‌ ఖాదర్‌భాషా, నెల్లూరు జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రం నుండి కామయ్య, రెడ్‌క్రాస్‌ సిబ్బంది, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు రఫీ, ఖాదర్‌ బీ, హరినాద్‌ రెడ్డి, కె.నారాయణ, శ్రీ చైతన్య డిగ్రీ కళాశాల, శ్రీ శ్రీనివాస జూనియర్‌ కళాశాల విద్యార్థులు పాల్గొని వాలెంటీర్స్‌ సేవలు అందించారు. కార్యక్రమానికి అవసరమైన ఖర్చు మొత్తం భరిస్తున్న ఎమ్‌.క్రిష్ణ కిషోర్‌ టీం అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.