Apr 08,2023 21:18

ఫొటో : వైద్య సేవలందిస్తున్న డాక్టర్‌ ప్రమీల

ఉచిత వైద్య శిబిరం
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బ న్‌ : మండలంలోని చెర్లోయడవల్లి గ్రామంలో జెడ్‌పి ఉన్నత పాఠశాలలో డాక్టర్‌ ప్రమీల మాదమాల ఎంబిబిఎస్‌, ఎమ్‌డి యుఎస్‌ఎ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం శనివారం నిర్వహించారు. ఈ శిబిరంలో 125 మందిని పరీక్షించి ఉచితంగా మందులు ఇచ్చారు. ముఖ్యంగా 60 మంది సుగరు, బి.పి., వ్యాధిగ్రస్తులకు మూడు నెలలకు సరిపడా మందులను అందజేశారు.
ఈ మందులను ఆలంబన ఫౌండేషన్‌- ఇండియా వారు సరఫరా చేశారు. ఈ వైద్య శిబిరాన్ని మాజీ సర్పంచ్‌ కేతా విజయభాస్కర్‌ రెడ్డి నిర్వహించగా, గ్రామ సచివాలయ వైద్య సిబ్బంది షంషాద్‌ బేగం, మాధురి, కాంతమ్మ, గ్రామ నాయకులు అంబటి రాధాకృష్ణారెడ్డి, షార్‌ విశ్రాంత ఉద్యోగి అల్లంపాటి ధనుంజయరెడ్డి, కామిరెడ్డి అశోక్‌, తదితరులు సహకారం అందించారు.