ఉచిత వైద్య శిబిరం
ప్రజాశక్తి-కావలి : సంయుక్త సేవాసంస్థ ఆధ్వర్యంలో జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రం నెల్లూరు, కావలి ఐఎంఎ వారి సహకారంతో జి.వంశీ, బి.శ్రీనాద్, ఎన్.శ్రీరాం బ్రహ్మం, జె.గంగాధర్, బి.భాగ్యరాజ్, జి.అనీల్‌కుమార్, ఎన్.నరేష్, జి.సుజన్, టి.శివ కుమార్, ఎం.క్రిష్ణ కిశోర్ దాతృత్వంతో తుఫాన్ నగర్లో ఉన్న శ్రీ పొట్టి శ్రీరాములు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఆదివారం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కావలి ఐఎంఎ ప్రెసిడెంట్ డాక్టర్ బి.సతీష్ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ వైద్యశిబిరంలో డాక్టర్ బెజవాడ రవికుమార్, డాక్టర్ బి సుబ్బారావు, డాక్టర్ సుధీర్ కుమార్, డాక్టర్ శివ ప్రసాద్, డాక్టర్ ఉమా చంద్‌లు పాల్గొని పేదలకు వైద్య సేవలు అందించారు. ఈ వైద్య శిబిరంలో పాల్గొన్న పేదలకు సంస్థ ద్వారా ఉచితంగా సుగర్ పరీక్షలు, ఇండియన్ రెడ్‌క్రాస్ వారి సహకారంతో ఉచితంగా బ్లెడ్ గ్రూపులు, రవి నర్సింగ్ హోమ్ వారి సహకారంతో బిపి, రక్త శాతం పరీక్షలు ఉచితంగా చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సుధీర్ కుమార్, డాక్టర్ ఉమాచంద్ మాట్లాడుతూ సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో పాల్గొన్న పేదలకు సుగర్ వ్యాధిపై, గుండె వ్యాధులపై ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కల్పించారు. సంయుక్త సేవాసంస్థ ద్వారా నిర్వహిస్తున్న అనేక సేవల్లో భాగంగా ఈ వైద్య శిబిరం పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేశారు. ప్రతి రెండునెలలకు ఒకసారి జరిగే ఈ వైద్య శిబిరంలో పేదప్రజలు పాల్గొని వైద్యసేవలు తీసుకోవాలని తెలియజేశారు. తదుపరి వైద్య శిబిరం మార్చి26న ఇదేపాఠశాలలో జరుగుతుందని తెలిపారు. అనంతరం కార్యక్రమానికి సహాయం అందజేసిన దాత క్రిష్ణకిశోర్‌తో పాటు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లకు చిరు సత్కారం చేసి, వైద్య శిబిరంలో పాల్గొని వాలంటీర్ సర్వీస్ చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందజేశారు. కార్యక్రమంలో నెల్లూరు జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రం నుంచి కామయ్య, దాత ఎం.క్రిష్ణ కిశోర్, పాఠశాల పేరెంట్స్ కమిటీ ప్రెసిడెంట్ జ్యోతి, సంయుక్త సేవాసంస్థ అధ్యక్షుడు సురేంద్ర, సంస్థ సభ్యులు ఎం.అజిత్ బాబు, పి.జానకి రామ్, జి.కళ్యాణి, జెవివి ప్రెసిడెంట్ తోట వెంకటేశ్వర్లు, ఆకుల.రమణయ్య, నారాయణ, షేక్.ఖాధర్ బాషా, హరినాథ్ వారి సభ్యులు, ఎం వి ఎన్ ప్రసాద్ రావు, డాన్స్ మాస్టర్ ముత్తశెట్టి.ఉమామహేశ్వరరావు, వాలంటీర్స్ పాల్గొని సేవలందించారు.










