Jan 06,2023 22:01

ఫొటో : మాట్లాడుతున్న డాక్టర్‌ ప్రభాకర్‌నాయుడు

ఉచిత వైద్య శిబిరం
ప్రజాశక్తి-కావలి : కావలి గుండెమడుగుల దేవదానం మెమోరియల్‌ హాస్పిటల్‌లో శుక్రవారం డాక్టర్‌. ఎన్‌.ప్రభాకర్‌నాయుడు ఆధ్వర్యంలో వారి కుమారుడు, ఎన్‌.సాయివర్షన్‌ జన్మదినం సందర్భంగా కిమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ నెల్లూరు వారి సౌజన్యంతో ఉచిత మెగా సూపర్‌ స్పెషాలిటీ వైద్య శిబిరం నిర్వహించారు. ముందుగా డాక్టర్‌ కుమారులు సాయివర్ష భారీ కేక్‌ కట్‌ చేసి, ఘనంగా పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్‌ ప్రభాకర్‌ నాయుడు మాట్లాడుతూ ఇప్పటి వరకు 123 ఉచిత మెగా వైద్య శిబిరములు నిర్వహించామని తెలిపారు. ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలు సూపర్‌ స్పెషాలిటీ వైద్యము కోసం వ్యయ ప్రయాసాలతో, ఇతర దూరప్రాంతాలకు పోలేక అనేక ఇబ్బందులు పడుతున్నందు వల్ల ఇలాంటి, ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి నామని తెలియజేశారు.
ఈ ఉచిత శిబిరంలో డాక్టర్‌ ఎ.వి.రెడ్డి, ప్లాస్టిక్‌ సర్జన్‌, డాక్టర్‌ సాహెబ్‌ పీర్‌, గుండెవ్యాధినిపుణులు, డాక్టర్‌.మస్తాన్‌వలి, నెఫరాలజిస్ట్‌, డాక్టర్‌ ఉదరు కిరణ్‌, న్యూరాలజిస్ట్‌, డాక్టర్‌ వంశీకృష్ణ, గాస్త్రోసర్జన్‌, డాక్టర్‌ శశిభరత్‌ రెడ్డి, పల్మనాలజీ , డాక్టర్‌ శ్రీహర్ష, జనరల్‌, డైబెటాల్జిస్ట్‌, డాక్టర్‌ మంజీర, చర్మవ్యాధి నిపుణులు, డాక్టర్‌ సుధీర్‌కుమార్‌ గుండె వ్యాధి నిపుణులు, డాక్టర్‌ వినరు వినోద్‌ బాబు, దంత వైద్య నిపుణులు, మొత్తం10, మంది డాక్టర్లు పాల్గొని, అన్ని రకాల వైద్య పరీక్షలు, నిర్వహించి, మందులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ శిబిరంలో మొత్తం 585మంది పాల్గొన్నారు. పి.ఆర్‌.ఒ ఆనంద్‌, హాస్పిటల్‌ సిబ్బంది పాల్గొని సేవలు అందించారు.