May 09,2023 21:03

ఫొటో : చిన్నారికి కంటి పరీక్షలు నిర్వహిస్తున్న డాక్టర్‌

ఉచిత కంటి వైద్య పరీక్షలు
ప్రజాశక్తి-కావలి : కావలి పట్టణంలోని క్రిష్టయన్‌ పేట 3వ లైన్‌లో ఉన్న శ్రీధర్‌ మల్టీస్పెషాలిటీ హస్పటల్‌లో మంగళవారం ఉదయం 10 నుంచి1 గంటలోపు పురిటి బిడ్డలకు డాక్టర్‌ వసుమతి వేదాంతం నేత్రాలయ హస్పటల్‌ చెన్నై వారి ఆద్వర్యంలో ఉచిత కంటి పరిక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రాధాత్రి నేత్రలయం వారు డాక్టర్‌ శ్రీధర్‌ మల్టీ స్పెషాలిటీ హస్పటల్‌ సహకారంతో పురిటి బిడ్డలకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించినట్లు ఇండియన్‌ అకడమిక్‌ పీడియాక్ట్రిస్‌ స్టేట్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ సురేష్‌ బాబు, కావలి ఐ. యమ్‌. ఎ సెక్రటరీ, చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్‌ శ్రీధర్‌ తెలిపారు.
ఈ ఉచిత కంటి వైద్య శిబిరం ప్రతినెలలో మెదటి మంగళవారం, మూడవ మంగళ వారాలలో నిర్వహించనున్నట్లు తెలిపారు. కావున పట్టణ ప్రజలతో పాటు మండల ప్రజలతో పాటు ఇతర ప్రాంతాలో ఉండేవారు కూడా సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ శివకుమార్‌, రెటీనా టెక్నీషియన్‌ అక్షరు, పురిటి బిడ్డల తల్లులు పాల్గొన్నారు.