ప్రజాశక్తి - చిలమత్తూరు : ప్రజా పంపిణీ వ్యవస్థద్వార పంపిణీ చేసే ఉచిత రేషన్ బియ్యానికి ఎండియూ వాహనదారుడు డబ్బులు వసూలు చేస్తున్నాడని మండలంలోని చెన్నేపల్లి కార్డుదారులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై కూర్చొని ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఆర్‌ఐ దుర్గేష్, విఆర్‌ఒ ప్రవీణ్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని లబ్దిదారులతో విచారించారు. తమ వద్ద బియ్యానికి డబ్బులు వసులు చేయడంతో పాటు కందిపప్పు 68 రూపాయాలకు ఇవ్వల్సి ఉండగా 75 వసులు చేస్తున్నాడని ఫిర్యాదు చేశారు. దీంతో ఎండియు వాహనదారుడు తాను డబ్బులు తీసుకున్న విషయాన్ని ఆంగీకరించాడు. తప్పుచేశానని ఒప్పుకున్నాడు. దీంతో తీసుకున్న డబ్బులు వెనక్కు ఇవ్వాలని అధికారులు ఆదేశించారు. అవినీతికి పాల్పడిన ఎండియు ఆపరేటర్‌పై లిఖిత పూర్వకంగా గ్రామస్తులు ఫిర్యాదు ఇస్తే పై అధికారులకు పంపి చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు నాగరాజు, అక్కులప్ప, నీరగంటి చౌడప్ప, నరసింహప్ప, టీడీపి నాయకులు విశ్వనాధ్ రెడ్డి, ఐటిడిపి నాగరాజు, నరేంద్ర, గంగప్ప, జయచంద్ర తదితరులు పాల్గొన్నారు.










