- ఇద్దరు యువకుల దుర్మరణం
ప్రజాశక్తి-రేపల్లె : వినాయక నిమజ్జనంలో అపశృతి జరిగింది. పోలీస్, రెవిన్యూ, ఫైర్ సిబ్బంది నిర్లక్ష్య వైఖరితో ఇద్దరు యువకులు నిండు ప్రాణాలు నీటి పాలైయ్యాయి. వివరాలు ప్రకారం పట్టణంలోని నేతాజీ నగర్ వాసులు వినాయక చవితి సందర్భంగా విగ్రహం ఏర్పాటు చేశారు. మూడవ రోజు బుధవారం రాత్రి విగ్రహ నిమజ్జనం ఏర్పాట్లలో భాగంగా ఉరేగింపుతో పెనుమూడి కృష్ణ నది ఒడ్డుకు చేరుకున్నారు. విగ్రహాన్ని నదిలో నిమజ్జనం చేస్తుండగా ప్రమాదవశాత్తు పడమటి విజయకుమార్ (20) కొండేటి వెంకటేశ్వర్లు(26) అను యువకులు నదిలో పడిపోయారు. గమనించిన స్నేహితులు రక్షించే ప్రయత్నం చేసే లోపే నదిలో మునిగిపోయి మృతి చెందారు. అయితే వినాయక విగ్రహాల ఏర్పాటు చేసే క్రమంలో అనుమతులు తీసుకోవాలంటూ ఊదరగొట్టిన పోలీసులు నిమజ్జన సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలుపై దృష్టి పెట్టకపోవటంతో ప్రమాదం జరిగిందని ప్రజలు ఆరోపిస్తున్నారు










