Oct 02,2023 11:50

ప్రజాశక్తి-ఢిల్లీ : టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ ని నిరసిస్తూ ఢిల్లీలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఎంపీలు "సత్యమేవ జయతే దీక్ష''  చేపట్టారు. గాంధీ జయంతి సందర్భంగా రాజమహేంద్రవరంలోని ఆయన విగ్రహానికి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  అనంతరం  క్వారీ సెంటర్ వద్ద నిరసన దీక్షలో కూర్చున్నారు. కాగా  మంగళగిరిలోని టిడిపి పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, తదితర నేతలు దీక్ష చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి శ్రేణులు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.