ప్రజాశక్తి-గుంటూరు : చంద్రబాబు అరెస్టు నిరసనగా గుంటూరులో టిడిపి నిర్వహించిన ర్యాలీ ఉద్రిక్తతకు దారి తీసింది. ర్యాలీలో పోలీసులకి, టీడీపీ కార్యకర్తలకు ఘర్షణ సంభవించింది. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు ఆంక్షలు విధించారు. దీంతో టిడిపి కార్యకర్తలు బారికెడ్స్ ను తోసుకొని ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు. నేను సైతం బాబు కోసం అనే ప్లేకార్డులు పట్టుకొని మహిళలు ర్యాలీలో పాల్గొన్నారు.










