ట్యాబ్‌లు పంపిణీ చేస్తున్న ఎంఎల్‌ఎ
ప్రజాశక్తి -గుడ్లూరు : మండలంలోని గుడ్లూరు హైస్కూల్లో 8వ తరగతి విద్యార్థులకు ఉచిత ట్యాబ్‌లు పంపిణీ కార్యక్రమంలో ఎంఎల్‌ఎ మహీధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చరిత్రలోనే ఇలాంటి కార్యక్రమాలు ఎవరు చేయలేదని ఆ ఘనత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని కొని ఆడారు. ఈ క్యాబ్‌ల ద్వారా విద్యార్థులకు మరింత విజ్ఞానం పెరుగుతుందని చెప్పారు. తద్వారా విద్యార్థులు అన్ని రంగాల్లో దూసుకొని పోయి అభివద్ధి చెందుతారన్నారు. డిప్యూటీ డీఈవో, జెడ్‌పిఇసి, తహశీల్దార్, ఎంపిడిఒ, ఎంపిపి, మండలంలో అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.










