త్వరలోనే కాళంగి
రిజర్వాయర్ గేట్లకు మరమ్మతులు
ప్రజాశక్తి - కెవిబిపురం
మండలంలో మరమ్మతుకు గురైన కాళంగి రిజర్వాయర్ గేట్లను త్వరలోనే బాగు చేస్తామని సత్యవేడు ఇరిగేషన్ డివిజనల్ ఇంజనీర్ ఆదినారాయణ నాయుడు చెప్పారు. సోమవారం ఆయన మాట్లాడుతూ కేవిబి పురం మండలంలోని కాలంగి రిజర్వాయర్ గేట్లను మరమ్మతు చేయడానికి గాను 15 లక్షల రూపాయలు అవసరం అవుతుందన్నారు. ఈ మేరకు ప్రతిపాదనలను ఉన్నతాధికారులకు పంపామని, త్వరలోనే నిధులు విడుదల అయ్యే అవకాశం ఉందన్నారు. కాలంగి రిజర్వాయర్ నిర్వహణ కోసం 10 లక్షల రూపాయలు ఇప్పటికే మంజూరు అయినట్టు ఆయన పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టి పెండింగ్లో ఉన్న చెరువు పనులను పూర్తి చేయించడానికి చట్ట పరంగా ముందుకు వెళ్తామన్నారు. ఇప్పటికే సంబంధించిన నోటీసులు జారీ చేశామన్నారు. పలు చెరువుల్లో మట్టి తవ్వి తరలించడానికి ఇరిగేషన్ శాఖ ప్రతిపాదనలు పంపినా, ప్రస్తుతం పడుతున్న వర్షాలకు మట్టి తరలింపు సాధ్యం కాదన్నారు. ఇరిగేషన్ ఏఈ బాబు పాల్గొన్నారు.










