Nov 15,2023 20:21

పులికనుమ రిజర్వాయర్‌ నుంచి ట్రయల్‌ రన్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే

ప్రజాశక్తి - కోసిగి
కోసిగికి త్వరలోనే శుద్ధమైన తాగునీరు, పొలాలకు సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి తెలిపారు. బుధవారం మండల ఇన్‌ఛార్జీ పి.మురళీ మోహన్‌ రెడ్డితో కలిసి పులికనుమ రిజర్వాయర్‌ నుంచి తాగు, సాగునీరు అందించేందుకు ట్రయల్‌ రన్‌ను ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ప్రారంభించారు. పులికనుమ రిజర్వాయర్‌ సమీపంలో దాదాపు రూ.6 కోట్లతో చేపట్టిన పనులను గురు రాఘవేంద్ర ప్రాజెక్టు ఇఇ రాజశేఖర్‌, డిఇ మురళీ, ఎఇ ప్రేమ్‌, పద్మ ఇంజినీరింగ్‌ ఏజెన్సీ మోహన్‌తో పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎంపిపి ఈరన్న, బెట్టనగౌడ్‌, శ్రీనివాస రెడ్డి, ఎన్‌.నాగరాజు, మహాంతేష్‌ స్వామి, సౌఖత్‌ అలీ, జగదీష్‌ స్వామి, ఉస్మాన్‌, బసిరెడ్డి, నరసింహులు గౌడ్‌, బుళ్లి నరసింహులు, హోళగుంద కోసిగయ్య, మల్లికార్జున గౌడ్‌, శివారెడ్డి పాల్గొన్నారు.