Mar 25,2023 20:52

మాట్లాడుతున్న చైర్మన్‌ రామిరెడ్డి మల్లికార్జున్‌ రెడ్డి

మాట్లాడుతున్న చైర్మన్‌ రామిరెడ్డి మల్లికార్జున్‌ రెడ్డి
త్వరలో మెగా రక్తదాన శిబిరం

కోవూరు: పట్టణంలోని శాంతినగర్‌లోని పడుగుపాడు సహకార సొసైటీ రైతుల సేవకు పూర్తి స్థాయిలో అంకితమై ఉందని చైర్మన్‌ రామిరెడ్డి మల్లికార్జున్‌ రెడ్డి తెలిపారు. స్థానిక సొసైటీ కార్యాలయంలో. శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు తమ సొసైటీ ద్వారా స్వల్పకాలిక రుణాలు 174 మందికి10,50 కోట్ల మేర రుణాలు అందించామన్నారు. అదేవిధంగా ఎస్‌ ఏ ఓ పథకం కింద.346 మందికి రూ.3.20 కోట్లు గహ రుణాలు కింద నలుగురికి 25 లక్షల మేర రుణాలు అందించామన్నారు.అదేవిధంగా సొసైటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బ్యాంకు ద్వారా 175 మందికి 3.5 కోట్ల మేర బంగారంపై రుణాలు అందించామన్నారు. ఇదే ప్రాంగణంలో 250 మెట్రిక్‌ టన్నుల. సామర్థ్యం గల గోదామును ఇరవై నాలుగు లక్షల వ్యయంతో నిర్మాణం చేపట్టామన్నారు. త్వరలో ఈ భవనాన్ని కోవూరు శాసనసభ్యులు. ప్రసన్న కుమార్‌ రెడ్డి ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు.అదేవిధంగా ఈనెల 30వ తేదీ సొసైటీ సర్వసభ్య సమావేశాన్ని పురస్కరించుకొని మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నా మన్నారు.
ఇందుకు రైతులు యువత పూర్తిస్థాయిలో సహకరించి విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యంగా తమ సొసైటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బ్యాంకులో లాకర్‌ సదుపాయం ఉందని, దీనిని రైతులు ప్రజలు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు.. కార్యక్రమంలో సొసైటీ సీఈఓ గోవర్ధన్‌ రెడ్డి, సొసైటీ సభ్యులు ఎ.ప్రసాద్‌, జి.జనార్దన్‌ పాల్గొన్నారు.