ఇళ్లను పరీశీలస్తున్న కమిషనర్ ఎస్ మనోహర్
ప్రజాశక్తి -కందుకూరు : జి+3 ఇళ్లలో జరుగుతున్న మౌలిక వసతుల పనులను బుధ వారం కమిషనర్ ఎస్ మనోహర్ పరిశీలించారు. సుమారు 90శాతం రోడ్లు, డ్రెయిన్లు పూర్తయ్యాయి.ఎస్‌టిపి ప్లాంట్ ఒకటి 70శాతం పూర్తి అయింది. ఇది పూర్తి అవగానే రెండు నెలల్లో ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని కమిషనర్ తెలిపారు. మొత్తం 1,408 ఇళ్లకు గానూ సుమారు 1200 మంది పేరు మీద రిజిస్ష్రేన్లు పూర్తి చేశారు. మిగతా వాళ్లు కూడా మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు










