మాట్లాడుతున్న రాష్ట్ర తెలుగు భాషాభివద్ధి ప్రాధికార సంస్థ అధ్యక్షులు పి విజరు బాబు
త్వరలో దక్షిణాంధ్ర భాషా ప్రాంతీయ సదస్సు
ప్రజాశక్తి-నెల్లూరు:తెలుగు భాష పరిపుష్టికి త్వరలో నెల్లూరులో దక్షిణాంధ్ర భాషా ప్రాంతీయ సదస్సు నిర్వహించనున్నట్లుగా రాష్ట్ర అధికార భాష సంఘం అధ్యక్షులు, రాష్ట్ర తెలుగు భాషాభివద్ధి ప్రాధికార సంస్థ అధ్యక్షులు పి విజరు బాబు తెలిపారు. సోమవారం నగరంలోని రహదారులు, భవనముల అతిధి గహంలో రాష్ట్ర అధికార భాష సంఘం సభ్యులు డాక్టర్ డి మస్తానమ్మ, డా టి వెంకటయ్య లతో కలసి అధ్యక్షులు విజరు బాబు తెలుగు సాహిత్యాభిలాష గల ప్రముఖులతో ఇష్టాగోష్టి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాషాభివద్ధికి అత్యధిక ప్రాధాన్యమిస్తుందని, అందుకనుగుణంగానే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో భాషా సదస్సులు, రచయితలను ప్రోత్సహించటం, శోభాయాత్రలను నిర్వహించడం వంటి వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ప్రాచీన సాహిత్యం తిక్కన కవితా ప్రాశ్చత్యం, ఆధునిక సాహిత్యం వంటి అంశాలపై సదస్సులు ఉంటాయన్నారు. ఈ ఇష్టాగోష్టి సమావేశంలో అభ్యుదయ రచయితల సంఘం జిల్లా అధ్యక్షులు డాక్టర్ జి శివకుమార్, సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రామకష్ణ, రిటైర్డ్ ప్రొఫెసర్ బి రాజేంద్ర సింగ్, డా టి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.










