అసంపూర్తిగా ఉన్న ఇల్లు
త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి
కొడవలూరు:త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని మండల ప్రత్యేక అధికారిణి ఈ సత్యవాణి సూచించారు. మండలంలోని జగనన్న లే అవుట్‌ను శనివారం ఆమె సందర్శించి లబ్ధిదారులతో మాట్లాడారు. నిర్మాణాలకు సంబంధించి బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నందున జాప్యం చేయడం ఏమిటని అడిగారు. ఉగాదికే పూర్తి చేయాల్సిన ఇంటి నిర్మాణాలు ఇప్పటికీ పూర్తికాకపోవడం ఏమిటని ప్రశ్నించారు. చిన్న పార్టీ పనులు మిగిలి ఉన్న గహాలన్నిటిని వారంలో పూర్తి చేసుకోవాలని సూచించారు. తొలుత స్థానిక మండల పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో మండలంలోని ఇంజినీరింగ్ అసిస్టెంట్లతో సమీక్ష నిర్వహించారు ప్రతి ఇంజినీరింగ్ అసిస్టెంట్ వారి పరిధిలోని గహ నిర్మాణాలకు సంబంధించి ప్రతిరోజూ ఒక బిల్లు అయిన పెట్టాలన్నారు. మూడ్రోజులపాటు ఎలాంటి బిల్లులు పెట్టని ఇంజినీరింగ్ అసిస్టెంట్‌లపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఆమె వెంట హౌసింగ్ ఏఈ సురేష్ కుమార్, వర్కింగ్ జానీ, డేటా ఎంట్రీ ఆపరేటర్ సునీత, ఉన్నారు.










