ఓబుళదేవరచెరువు : నాటు వైద్య వికటించి ఇద్దరు మృతి చెందిన విషయం తెలుసుకున్న జిల్లా వైద్యాధికారులు ఆ గ్రామాల్లో పర్యటించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అడిషనల్ డిప్యూటీ డిఎంఅండ్‌హెచ్‌ఒ డాక్టర్ మైనుద్దీన్ శనివారం ఉదయం తుమ్మలకుంట్లపల్లి, బసవప్పగారిపల్లిలో పర్యటించారు. సూదిమందు వేయించుకున్న వారితో మాట్లాడారు. ఆరోగ్య పరిస్థితి బాగాలేని వారిని చికిత్సల నిమిత్తం ప్రభుత్వాసుపత్రిలో చేరాలని సూచించారు. బత్తపల్లి ఆర్టీసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని కలిసి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు.
ఎమ్మెల్యే, మాజీ మంత్రి పరామర్శ
సూదిమందు వికటించి ఇద్దరు మృతి చెందిన విషయం తెలుసుకున్న పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దకుంట శ్రీధర్‌రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డిలు ఆ గ్రామాల్లో పర్యటించారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మృతుల దహన సంస్కారాల నిమిత్తం పల్లె రఘునాథరెడ్డి ఒక్కో కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎంపి జాకీర్ అహ్మద్, టిడిపి నాయకులు వెంకటేష్, జయచంద్రారెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాసులు పాల్గొన్నారు. వైసిపి నాయకులు వాసుదేవ రెడ్డి, మార్కెట్‌యార్డు ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డిలు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి తమ వంతుగా ఒక్కో కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో వైసిపి కన్వీనర్లు కోళ్ల కష్ణారెడ్డి, మధు తదితరులు పాల్గొన్నారు










