Feb 13,2023 21:40

ఉరేసుకుని మృతిచెందిన విద్యార్థిని మంగిర అఖిల

 వేంపల్లె మండలంలోని ఆర్‌జెయుకెటి ఇడుపులపాయి ట్రిపుల్‌ఐటిలో ఇ-4 చదివే ఇంజినీరింగ్‌ విద్యార్థిని మంగిర అఖిల (22)ఆత్మహత్య చేసుకొంది. విద్యార్థులు, అధికారుల సమాచారం మేరకు.. అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం శిబ్యాల గ్రామంలోని బోగంపల్లెకు చెందిన యోగాంజనేయులు, విజయ కుమార్తె మంగిర అఖిల ట్రిపుల్‌ఐటిలో ఇ-4 (చివరి సంవత్సరం) ఎలక్ట్రానిక్‌ కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ చదువుతుంది. సోమవారం ఉదయం దాదాపు 9 గంటల మధ్యలో తల్లిలో మాట్లాడింది. గదిలో ఎవరూ లేని సమయంలో కిటికీకి చున్నితో మెడకు చుట్టుకుని ఆత్మహత్య చేసుకుది. మృతురాలి తండ్రి బతుకు దెరువు కోసం కువైట్‌కు వెళ్లారు. చదువులో బాగా రాణిస్తున్న అఖిల ఉన్నటుండి ఆత్మహత్యకు పాల్పడంతో సహ విద్యార్థులు శోసంద్రంలో ముగినిపోయారు. హాస్టల్‌ రూమ్‌లో అఖిలతోపాటు మరో ఇద్దరు విద్యార్థినులున్నారు. తన తల్లితో ఫోన్‌లో మాట్లాడిన తరువాత పాఠశాలకు వెళ్లేం దుకు డ్రెస్‌ వేసుకుంది. గదిలో ఎవరూ లేని సమయంలో తలుపులు వేసుకుని కిటికీకి చున్నితో ఉరివేసుకుంది. లీజర్‌ సమయంలో తోటి విద్యార్థులు గదికి వచ్చి తలుపు కొట్టగా తీయకపోవడంతో వెంటనే సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సిబ్బంది తలుపులు తీయగా అఖిల కిటికీకి ఉరేసుకుని మృతిచెందినట్లు గుర్తించారు. హుటాహుటీనా తోటి విద్యార్థులు మెడకు ఉన్న చున్నిని తొలగించి కిందకు దింపగా అప్పటికే విద్యార్థిని మృతిచెందింది. వెంటనే విసి విజరుకుమార్‌, డైరెక్టర్‌ సంధ్యారాణి సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. సిఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ రంగారావు, తిరుమలనాయక్‌ వచ్చి పరిస్థితి సంఘటనపై ఆరా తీశారు. విద్యార్థి సెల్‌ఫోన్‌, లాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకుని తోటి విద్యార్థులను ఆత్మహత్యకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని అంబులెన్స్‌లో వేంపల్లె ఆస్పత్రికి తరలించారు. అధికారులు విద్యార్థి తల్లికి సమాచారం ఇవ్వడంతో ఆమె వేంపల్లె ఆస్పత్రికి వెళ్లి కుమార్తె మృతదేహం వద్ద బోరున విలపించారు. కుటుంబ సమస్యలతో మృతిచెందినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు డైరెక్టర్‌ సంధారాణి చెప్పారు. ఇదీలా ఉండగా తమకు ఎలాంటి కుటుంబ సమస్యలు లేవని, కష్టపడి ఇద్దరు పిల్లల్ని చదించుకుంటున్నామని మృతురాలి తల్లి పేర్కొన్నారు. ఇద్దరు పిల్లల్లో అఖిల పెద్దమ్మాయి అని, కొడుకు బిటెక్‌ చదువుతున్నాడని తెలిపారు. క్షణికావేశంలో విద్యార్థులు ఇలాంటి ఆత్మహత్యలకు పాల్పడ్డం తల్లిదండ్రుల క్షోభకు గురి చేస్తుందని ట్రిపుల్‌ఐటి డైరెక్టర్‌ పేర్కొన్నారు. కాగా విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రంగారావు చెప్పారు.