ఫొటో : రికార్డులు పరిశీలిస్తున్న జిల్లా ఖజానా ఉపసంచాలకులు డి.గంగాద్రి
ట్రెజరీ కార్యాలయంలో తనిఖీ
ప్రజాశక్తి-ఆత్మకూరుఅర్బన్ : ఆత్మకూరు పట్టణంలోని సబ్ ట్రెజరీ కార్యాలయాన్ని జిల్లా ఖజానా ఉపసంచాలకులు డి.గంగాద్రి శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్షిక తనిఖీల్లో భాగంగా ఇవాళ ఆత్మకూరు పట్టణంలో సబ్ ట్రెజరీ కార్యాలయంలో రికార్డులను పరిశీలిం చారు. రికార్డుల నిర్వహణపై సిబ్బందికి సలహాలు సూచనలు అందజేశారు. కార్యక్రమంలో ఆత్మకూరు సహాయ ఖజానా అధికారి ఆత్మకూరు ఎన్.రవి కుమార్, ఎస్‌టిఒ వి.కిరణ్, సిబ్బంది ఉన్నారు.










