Mar 11,2023 22:09

ద్విచక్ర వాహనదారుడిని హెచ్చరిస్తున్న పోలీసులు

        ప్రజాశక్తి-రొద్దం   మండల కేంద్రంలోని నెలకొన్న ట్రాఫిక్‌ సమస్యను పోలీసులు ఎట్టకేలకూ శనివారం తొలగించారు. గత శనివారం వారపు సంత రోజున నెలకొన్న ట్రాఫిక్‌ సమస్యపై 'వాహనదారుల ఇక్కట్లు' అనే శీర్షికను ప్రజాశక్తిలో వార్త ప్రచురితమైన విషయం తెలిసిందే. ఇందుకు స్పందించిన ఎస్‌తై నాగ స్వామి శనివారం పోలీసులు ఏర్పాటు చేసి రోడ్డుకు అడ్డంగా ఉంచిన వాహనాలకు అపరదా రుసుం విశించారు. దాదాపు 25 వాహనాలకు అపరాద విధించడంతోపాటు తర్వాత ఇలాగే కొనసాగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్రాఫిక్‌ సమస్య తొలగించడంతో వాహనదారులు, దుకాణదారులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జమేదార్‌ కాంతప్ప, పోలీసులు దాదు, శివకుమార్‌ తదితరులు పాల్కొన్నారు.