May 20,2023 22:07

ఫొటో : ట్రాఫిక్‌ సమస్యలు పరిశీలిస్తున్న అధికారులు

ట్రాఫిక్‌ సమస్యను పరిశీలించిన అధికారులు
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : పట్టణంలోని ప్రధాన ట్రాఫిక్‌ సమస్యగా ఉన్న సోమశిల రోడ్డు ప్రాంతాన్ని ఆత్మకూరు డిఎస్‌పి కోటారెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ నాగేశ్వరరావు, స్థానిక ఎస్‌ఐ శివశంకరరావు, మున్సిపల్‌ శాఖ ఇతర అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఇక్కడి సమీపంలో ఉన్న షాపుల యజమానులకు మీ షాపుల ఎదుట ఎటువంటి బోర్డులు గానీ వాహనాలు గానీ ఉంచరాదని సూచించారు.
ఆక్రమిత ప్రాంతాలను త్వరలో తొలగిస్తామని ఈ సందర్భంలో కమిషనర్‌ నాగేశ్వరరావు తెలిపారు. ట్రాఫిక్‌ నియంత్రణకు అడ్డంకులు కల్పిస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని డిఎస్‌పి కోటారెడ్డి హెచ్చరించారు. వీరు సోమశిల రోడ్డు సెంటర్‌ నుండి ఆర్‌టిసి డిపో వరకు పరిశీలించారు. మున్సిపల్‌ ఏఈ ప్రసాద్‌ తదితరులు ఉన్నారు.