ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం
ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు : ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రాణాలను కాపాడుకోవాలని కష్ణపట్నం సిఐ కె. వేమారెడ్డి సూచించారు. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం తోటపల్లిగూడూరులో పోలీసులు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఎస్‌ఐ కె. ఇంద్రసేనా రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వేమారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సిఐ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. ప్రజల ప్రాణాలను కాపాడాలన్న ఉద్ధేశ్యంతోనే ప్రతి ఏడాది జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఐ ఇంద్రసేనా రెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా పోలీసులు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో పోలీసులు, మహిళా పోలీసులు పాల్గొన్నారు.










