ఫొటో : తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు
టపాసులు గోడౌన్‌లో తనిఖీ
ప్రజాశక్తి-ఉదయగిరి : ఉదయగిరి ట్యాంక్ బండ్ సమీపంలో ఉన్న విఆర్ టపాసుల గోడౌన్‌ను సర్కిల్ ఇన్స్పెక్టర్ వి.గిరిబాబు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్‌పి ఆదేశాల మేరకు పట్టణంలోని పలు టపాసుల గోడౌన్‌లను తనిఖీలు చేపట్టామన్నారు. అనుమతులు లేకుండా గోడౌన్‌లలో టపాసులు నిలువలు చేస్తే వారిపై శాఖా పరమైన చర్యలు తప్పవని ఆయన యజమానులను హెచ్చరించారు. ఈ తనిఖీల్లో ఎస్‌ఐ కర్నాటి ఇంద్రసేనారెడ్డి, విఆర్‌ఒలు జాఫర్, వెంకటరమణయ్య, అగ్నిమాపక సిబ్బంది ఫిరోజ్, యజమాని పాల్గొన్నారు.










