Feb 22,2023 22:18

విజేత జట్టుతో మాజీ మంత్రి, తదితరులు

ప్రజాశక్తి మడకశిర రూరల్‌ : పది రోజులుగా మండల పరిధిలోని సి కొడిగేపల్లి గ్రామంలో కంపెనీ సెక్రటరీ సురేష్‌ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి వైఎస్‌ఆర్‌ టి-10 మెమోరియల్‌ రెడ్‌ టెన్నిస్‌ బాల్‌ క్రికెట్‌ టోర్నీ బుధవారం ముగిసింది. ఫైనల్‌ మ్యాచ్‌లో మడకశిర ఎంటీఎస్‌ జట్టు, రొళ్ల ఫ్రెండ్స్‌ జట్టుపై 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. విజేతకు మాజీ మంత్రి రఘువీరారెడ్డి చేతుల మీదుగా ట్రోఫీతో పాటు లక్ష రూపాయల నగదు బహుమతిని అందజేశారు. అనంతరం టోర్నీ నిర్వాహకుడు సురేష్‌ రెడ్డిని క్రీడాకారులు శాలువా పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచి కవిత అనిల్‌ కుమార్‌ రెడ్డి, చిలమత్తూరు సర్పంచి రామచంద్ర రెడ్డి, నాయకులు శాలిని సుధాకర్‌ రెడ్డి, మంజునాథ్‌ రెడ్డి, చెరుకూరు సర్పంచి శేఖర్‌ రెడ్డి, సునీల్‌ కుమార్‌ రెడ్డి, చిన్న నర్సప్ప తదితరులు పాల్గొన్నారు.