తోపుడు బండి అందజేస్తున్న ఇంటూరి నాగేశ్వరరావు
ప్రజాశక్తి -కందుకూరు :పట్టణంలోని 25వ వార్డు కొత్తకుమ్మరిపాలెంలో నివాసముండే కలికివాయి సుజాత కూరగాయల వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఆ కుటుంబానికి తోడుగా నిలిచేందుకు కందుకూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు గురువారం సుజాతకు తోపుడు బండి అందజేశారు. పట్టణ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, వార్డు నాయకులు గుర్రం మల్లికార్జున, నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు నాదెండ్ల వెంకట సుబ్బారావు, నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి గోచిపాతల మోషే, పట్టణ ఉపాధ్యక్షుడు వడ్డేళ్ళ రవిచంద్ర, పార్టీ నాయ కులు బద్దిపూడి శిఖామణి, మణికే మాల్యాద్రి, జడ రవీంద్ర పాల్గొన్నారు.










