Apr 24,2023 19:49

తోపుడు బండి పంపిణీ చేస్తున్న రాజేష్‌ ఆనుచరులు

ప్రజాశక్తి -కందుకూరు  మండలంలోని పొట్లూరు గ్రామానికి చెందిన చిరు వ్యాపారి పులిపాటి రాధకు టిడిపి నెల్లూరు పార్లమెంటు ఉపాధ్యక్షులు ఇంటూరి రాజేష్‌ ఆదేశాల మేరకు ఇంటూరి రాజేష్‌ కార్యాలయంలో తోపుడు బండి పంపిణీ చేయడం జరిగింది. టిడిపి నాయకులు ఉమ్మడిపోలు కోటేశ్వరరావు, కాకు వేణు, మువ్వా మల్లికార్జున, సంగా రాము, పొడపాటి శ్రీను, బత్తిని వెంకటేశ్వర్లు, నల్లమోతు శ్రీహరి, పిన్నంరాజు ప్రభాకర్‌, గోరంట్ల బ్రహ్మయ్య, గంగవరపు బ్రహ్మయ్య, బి వెంకయ్య పాల్గొన్నారు.