ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు :అనారోగ్యంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన తమ కుమారుడు తిరిగి క్షేమంగా ఇంటికి చేరుకున్నాడు. ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న పోలీసులకు తల్లిదండ్రులు కత్ఞతలు తెలిపారు. మండలంలోని వరిగొండ దేవళ్లాలమిట్ట ప్రాంతానికి చెందిన నెల్లూరు జయమ్మ, శ్రీనివాసులు కుమారుడు తరుణ్ సాయి గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తమ ఇంటి పొరుగు వారు దూషించారని మనస్థాపం చెందిన తరుణ్ సాయి కొద్ది రోజుల ఇంటి నుంచి పారిపోయాడు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఎస్‌ఐ కె. ఇంద్రసేనా రెడ్డి కనిపించకుండా పోయిన తరుణ్ సాయి సమాచారాన్ని పలు పోలీసు స్టేషన్లకు చేరవేశారు. ఈ నేపథ్యంలో తరుణ్ సోమశిల ప్రాంతంలో వున్న సమాచారం పోలీసులకు చేరింది. దాంతో సోమశిల ప్రాంతంలో వున్న తరుణ్ సాయిని పోలీసులు సోమవారం తల్లిదండ్రులకు అప్పగించారు. క్షేమంగా తమ వద్దకు చేరిన కుమారుడు తరుణ్ సాయి చుసి తల్లిదండ్రులు సంబరపడ్డారు. పోలీసులకు కత్ఞతలు తెలిపారు.










