రాజంపేట అర్బన్ : జన్మనిచ్చిన తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చేందుకు ప్రతి విద్యార్థీ బాగా కష్టపడి, ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ ఆకేపాటి సుధాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని ఆర్‌ఎస్ రోడ్డులో ఉన్న శ్రీ చైతన్య పాఠశాలలో ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమాన్ని ఏజీఎం రమణయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏజీఎం ప్రిన్సిపల్ మాట్లాడుతూ పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులకు ముందుగా అభినందనలు తెలిపారు. పరీక్షలు బాగా రాసి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలన్నారు. పరీక్షల్లో విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలన్నారు. ప్రతి విద్యార్థీ బాగా కష్టపడి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో భాగంగానే 9వ తరగతి చదివే విద్యార్థులు పదవ తరగతి విద్యార్థులకు ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు. అనంతరం వివిధ సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించి, ఫొటో ప్రదర్శన కార్యక్రమం చేపట్టారు. చివరగా పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ అనూష, డీన్ వెంకట సుబ్బయ్య, సి బ్యాచ్ ఇన్ ఛార్జ్ శ్రీనివాసులు, ప్రైమరీ ఇన్‌ఛార్జి కస్తూరి, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.










