Jan 10,2023 21:31

ఫొటో : మాట్లాడుతున్న కోవూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి పోలంరెడ్డి దినేష్‌రెడ్డి

తక్కువ కాలంలో ఎన్‌టిఆర్‌ సిఎం పగ్గాలు
ప్రజాశక్తి-ఇందుకూరుపేట : దేశంలో ఎక్కడా లేనివిధంగా అతి తక్కువ సమయంలో ప్రజల మనసుల్లో స్థానాన్ని సంపాదించి కేవలం 9 నెలల కాల వ్యవధిలో ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన ఘనత దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకి చెందుతుందని కోవూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి పోలంరెడ్డి దినేష్‌రెడ్డి కొనియాడారు. మంగళవారం మండలంలోని మైపాడు పడమటిపాలెంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మత్స్యకారులు పెద్దఎత్తున ఆయనకు పూలతో సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్‌సి, ఎస్‌టి, బిసి సామాజిక వర్గాల వారిని, ముఖ్యంగా మత్స్యకారులను వైసిపి ప్రభుత్వం చేస్తుందన్నారు. ఈ నాలుగు సంవత్సరాల కాలంలో అభివృద్ధి జరగక పోగా రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
పెంచిన నిత్యవసర సరుకుల ధరలతో రాష్ట్ర ప్రజలు బతుకు భారంగా మారిందన్నారు. కోవూరు నియోజకవర్గంలో ఒక రోడ్డుని కూడా వేసిన పాపానపోలేదన్నారు. కార్యక్రమంలో ఇందుకూరుపేట టిడిపి అధ్యక్షులు రావెళ్ల వీరేంద్ర చౌదరి, జిల్లా అధికార ప్రతినిధి చెముకుల కృష్ణ చైతన్య, బిసి సెల్‌ నాయకులు గంపల అనిల్‌, టిడిపి సీనియర్‌ నాయకులు లెనిన్‌, కొండూరు సుధాకర్‌రెడ్డి, మునగాల రంగారావు, మైనార్టీ నాయకులు ఇంతియాజ్‌, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చెంచు కిషోర్‌ బాబు, తదితరులు పాల్గొన్నారు.