ప్రజాశక్తి-పెనుగంచిప్రోలు
స్థానిక శ్రీ తిరుపతమ్మ అమ్మవారిని శనివారం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి మల్లికార్జునరావు కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు., పూజల అనంతరం ఆయన ఆలయంలో గోపూజ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ చెన్నకేశవరావు ఆయనను అమ్మ వారి స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు ధర్మకర్త లు పాల్గొన్నారు. ప్రజాశక్తి-జగ్గయ్యపేట : మండలంలోని వేదాద్రి గ్రామంలోని శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి వారిని రాష్ట్ర హైకోర్ట్ న్యాయమూర్తి టి.మల్లిఖార్జునరావు సతిసమేతంగా శనివారం దర్శించుకున్నారు. ఆయనకు దేవస్థాన అర్చకులు వేదాంతం శ్రీధరాచార్యులు పూర్ణకుంభంతో సాదరంగా ఆహ్వానించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారి చిత్ర పటం, పట్టు వస్త్రములతో సత్కరించినట్లు దేవస్థాన కార్యనిర్వహణాధికారి కె. నాగరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిల్లకల్లు ఎస్‌ఐ సిహెచ్ చినబాబు, జగ్గయ్యపేట తహసిల్దార్ నాగేశ్వరరావు పాల్గొన్నారు.










