Oct 26,2023 21:18

కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన ఆర్డీవో నిశాంత్‌రెడ్డి

తిరుపతి ఆర్డీవోగా నిశాంత్‌ రెడ్డి బాధ్యతలు స్వీకరణ
ప్రజాశక్తి -తిరుపతి టౌన్‌
తిరుపతి ఆర్‌డిఓగా నిశాంత్‌ రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నిశాంత్‌ రెడ్డి మాట్లాడుతూ తిరుపతి రెవిన్యూ డివిజన్‌ పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కషి చేస్తానని చెప్పారు. తిరుపతి యాత్రా స్థలం కావడంతో ప్రోటోకాల్‌ పాటించడానికి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. తర్వాత ఆర్డీవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కలెక్టర్‌ వెంకటరమణారెడ్డిని, జెసి డీకే బాలాజీని, డిఆర్‌ఓను మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుపతి రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఉన్న తహశీల్దార్లు అందరూ కొత్త ఆర్డిఓ ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన ఆర్డీవో నిశాంత్‌రెడ్డి