ప్రజాశక్తి-పెనుగంచిప్రోలు
రాష్ట్రంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ తిరు పతమ్మ అమ్మవారి ఆలయ కార్యనిర్వహ ణాధికారిగా కె. శోభారాణి నియమితుల య్యారు. ఈ మేరకు గురువారం ఉత్తర్వులను విడుదల చేశారు. ప్రస్తుతం కార్యనిర్వహ ణాధికారిగా ఉన్న ఎన్‌విఎస్‌ఎన్ మూర్తి ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లా అన్నవరం దేవస్థానం కార్యక్రమ అధికారిగా బదిలీ అయ్యారు. గొల్లపూడిలోని రాష్ట్ర దేవాదాయ కమిషనర్ కార్యాలయంలో సహాయ కమిషనర్ గా పనిచేస్తున్న శోభారాణి అమ్మవారి ఆలయ కార్య నిర్వహణాధికారిగా నియమితుల య్యారు. గతంలో కూడా ఆమె రెండు పర్యాయాలు కార్యనిర్వహణాధికారిగా ఆమె పని చేశారు.










