హైదరాబాద్ : టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కోకాపేటలో వేలం వేసిన ప్రభుత్వ భూముల అమ్మకాల్లో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో... రంగారెడ్డి జిల్లా కోకాపేటలో ప్రభుత్వం వేలం వేసిన భూముల సందర్శన, ధర్నాకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు సోమవారం తెల్లవారుజామున రేవంత్ రెడ్డి ఇంటి వద్ద భారీగా మోహరించారు. రేవంత్ రెడ్డిని గృహ నిర్బంధం చేశారు. పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేస్తున్నారు.










