ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు :తోటపల్లిగూడూరులో శనివారం డ్రోన్ కెమెరా ద్వారా అధికారులు రీ సర్వే ప్రారంభించారు. భూముల కొలతల విషయాల్లో ఖచ్చితమైన కొలతలు ఇవ్వడం ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న ఉద్ధేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం డ్రోన్ కెమెరా ద్వారా రీ సర్వే కార్యక్రమం చేపడుతున్న విషయం తెలిసిందే.ఈ మేరకు తహశీల్దార్ (ఎఫ్‌ఏ సి) శివయ్య, ఆర్‌ఐ సునీల్ రెడ్డి, సర్వే ఆఫ్ ఇండియా మహ్మద్ అలీ, మండల సర్వేయర్ విజరు కుమార్, విఆర్వో శీరం శ్రీనివాసులు పర్యవేక్షణలో డ్రోన్ సర్వే ప్రక్రియ జరిగింది. బిట్-1 పరిధిలో మొదటి రోజు 2,200 ఎకరాలు సర్వే చేయడం జరిగింది. మాజీ జెడ్‌పిటిసి సభ్యులు చిరంజీవి గౌడ్, ఎఎంసి డైరెక్టర్, జై గౌడ్ జిల్లా ఉద్యమం జిల్లా అధ్యక్షులు మన్నెం సుబ్రహ్మణ్యం గౌడ్, పాకం ప్రవీణ్ కుమార్, అన్నం శ్రీ హరి తిలకించారు.










