Jan 11,2023 20:31

క్యాలెండర్‌ను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌


క్యాలెండర్‌ను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌
తిక్కన భవన్‌లో టేబుల్‌ క్యాలెండర్‌ ఆవిష్కరణ
నెల్లూరు :ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్‌, హెల్త్‌ అడ్మినిస్ట్రేషన్‌ మెడికల్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాఖల టేబుల్‌ క్యాలెండర్‌ ఆవిష్కరణ కార్యక్రమం కలెక్టరేట్‌ ఆవరణంలోని తిక్కన భవన్‌లో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా కలెక్టర్‌ కెవిఎన్‌ చక్రధర్‌బాబు, జెడ్‌పి చైర్మన్‌ ఆనం అరుణమ్మ, ఎంఎల్‌సి బల్లి కళ్యాణ చక్రవర్తి, మేయర్‌ పొట్లూరు స్రవంతి జయవర్థన్‌లు హాజరైయ్యారు.
ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు కలెక్టర్‌ కెవిఎన్‌ చక్రధర్‌బాబును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎపి.జి.ఇ.యప్‌,హంస జిల్లా అధ్యక్షులు చేజర్ల సుధాకర్‌ రావు, జిల్లా గౌరవ అధ్యక్షులు డాక్టర్‌ వై వెంకటేశ్వర్లు , ఏపిజిఈఎఫ్‌ జిల్లా జనరల్‌ సెక్రెటరీ దేవిరెడ్డి రమణారెడ్డి, హంస జిల్లా అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ అమరేంద్రనాథ్‌ రెడ్డి, జిల్లా జనరల్‌ సెక్రెటరీ కమల్‌ కిరణ్‌, జిల్లా ట్రెజరర్‌ శేషగిరిరావు, జిల్లా ఉపాధ్యక్షులు బెనర్జీ ,సచివాలయం ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు సతీష్‌ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు హరీష్‌ రెడ్డి ,సిటీ అధ్యక్షులు బాలు, సిటీ నాయకులు వినాయక్‌ యాదవ్‌ వైద్య ఆరోగ్యశాఖ రిటైర్డ్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు హరిబాబు మహిళా విభాగం రిటైర్డ్‌ ఎంప్లాయిస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్‌. ఇందిరా ,జిల్లా సెక్రెటరీ కల్పం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.