పెనుకొండ : టీడీపీ ఈడిగ సాధికార జిల్లా కమిటీ ప్రమాణ స్వీకారం సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో చెప్పిన పలువురి నేతల అభిప్రాయాలను, తీర్మానాలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తామని ఈడిగ సాధికార రాష్ట్ర అబ్జర్వర్ తాతా జయప్రకాష్ నారాయణ తెలిపారు. సోమవారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లోని బ్రాందీ షాపులను ఈడీగ గౌడ కులస్తులకు 30 శాతం ఇవ్వాలని సమావేశంలో తీర్మానించామన్నారు. దీంతో పాటు సమావేశంలో చేసిన తీర్మాణాలను, నాయకుల అభిప్రాయాలను పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ,రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు కొల్లు రవీంద్ర దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ చిన్నప్పయ్య, బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గిరిధర్ గౌడ్, నాయకులు జగలేటి శ్రీనివాసులు గౌడ్, జగలేటి మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.










