టీకాల కార్యక్రమంలో పరిశీలన
ప్రజాశక్తి మర్రిపాడు : మండలంలోని కంపసముద్రం సచివాలయం పరిధిలోని చాబోలు అంగన్‌వాడీ సెంటర్‌లో జరుగుతున్న వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని సూపర్‌వైజర్ ఎస్.కె.ఖాజామోహిద్దీన్ పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు సలహాలు ఇచ్చారు. ఆయన తల్లులను ఉద్దేశించి మాట్లాడుతూ గర్భం ధరించినప్పటి నుండి కాన్పు అయ్యే వరకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు వసతులు కల్పిస్తుందని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు పొందాలని, వ్యాధినిరోధక టీకాలు సకాలంలో వేయించుకోవాలని కోరారు. వైఎస్‌ఆర్ సంపూర్ణ పోషణ అమలు తీరును అంగన్‌వాడీ టీచర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఏప్రిల్ 1 నుండి రెండవ కాన్పులో అమ్మాయిలు పుట్టిన తల్లులకు ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకం కింద ఆర్థిక లబ్ధి చేకూరుతుందని తెలిపారు. రెండవకాన్పులో అమ్మాయిలు పుట్టిన తల్లులు డాక్యుమెంట్లు పి హెచ్ సిలో అందజేయాలన్నారు. కార్యక్రమంలో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ ఎం.భూలక్ష్మీ, ఎఎన్‌ఎం ఎస్.కె.రసూల్ బి, అంగన్‌వాడీ టీచర్ పి.వెంకటలక్ష్మి, ఆయా ఎం.లక్ష్మిదేవి, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు.










