Jan 01,2023 09:02

0వ వార్డులో ఇదేం ఖర్మ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీనాయకులు

          ధర్మవరం టౌన్‌ : రాష్ట్రం అన్ని రంగాల్లో సమగ్రాభివద్ధి చెందాలంటే టిడిపితోనే సాధ్యమని 10వ వార్డు టిడిపి ఇన్‌ఛార్జి క్రిష్ణాపురం జమీర్‌ అహమ్మద్‌' పేర్కొన్నారు. పట్టణంలోని 10వ వార్డులో శనివారం ఇదేం ఖర్మ మనరాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ అరాచక, అస్తవ్యస్త పాలనతో అన్నివర్గాల ప్రజలు విసిగిపోయారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో 10 వార్డు అధ్యక్షులు బుల్లెట్‌ బాషా, తెలుగుయువత జిల్లా ఆర్గనైజింగ్‌ సెక్రటరీ తిరుమలేశ్‌. టిఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఇర్షాద్‌, నియోజకవర్గ టిఎన్‌ఎస్‌ఎఫ్‌ ఉపాధ్యక్షుడు వినోద్‌, జనరల్‌ సెక్రటరీ హరి, నాయకులు బిల్లే రామకష్ణ, రమేశ్‌, షహీద్‌ బాబా పాల్గొన్నారు.