ప్రజాశక్తి-విజయవాడ: నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రక్కన నూతనంగా ఏర్పాటు చేసిన టిడ్కో హౌసింగ్ స్పెషల్ సెల్ (రిజిస్ట్రేషన్ సెల్) ను నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిడ్కో గహాలకు సంబంధించిన ప్రజలకు ఎదురవుతున్న సందేహాలను నివత్తి చేయడానికి లబ్దిదారులకు అందుబాటులో ఉండటానికి, అధికారులు మరియు సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విజయవాడ నగర పరిధిలో సుమారుగా ఆరు వేల మందికి టిడ్కో ఇళ్లు మంజూరు అయ్యాయని, వీటిల్లో రెండు వేల ఇళ్ళు మాత్రమే నిర్మాణం పూర్తి చేయడం జరిగిందన్నారు. మిగిలిన గృహాల నిర్మాణం డిసెంబర్ నాటికి పూర్తవుతాయన్నారు. సింగల్ విండో సిస్టమ్ ద్వారా టిడ్కో ఇళ్ళకు సంబందించి అన్ని అంశాలను ఇక్కడ పరిష్కరించుట జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అదనపు కమిషనర్(జనరల్) యం.శ్యామల, జాయింట్ డైరెక్టర్ (అమత్) లత తదితరులు పాల్గొన్నారు.










