టిడిపి సంబరాలు చేసుకుంటున్న దృశ్యం
టిడిపి..వైసిపి పోటా పోటీగా సంబరాలు
నెల్లూరు:తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎంఎల్‌సి ఎన్నికల్లో వైసిపి బలపరిచిన అభ్యర్థి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, పట్టభద్రుల ఎంఎల్‌సి స్థానానికి పోటీ చేసి విజయానికి కూత వేటు దూరంలో కంచర్ల శ్రీకాంత్ చౌదరి ఉండటంతో రెండు రాజకీయ పార్టీ శ్రేణులు పోటాపోటీగా నగరంలో సంబరాలు నిర్వహించారు. ఉపాధ్యాయ ఎంఎల్‌సిగా పి.చంద్రశేఖర్‌రెడ్డి విజయం సాధించి నగరానికి చేరుకోవడంతో ఆయన అభిమానులు గజమాలతో అభినందనలు తెలియజేశారు. తూర్పు,పశ్చిమ, ఉత్తరాంధ్ర, రాయలసీమ పట్టబధ్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధులు మెజార్టీ సాధించడంతో ఆ పార్టీ శ్రేణులు నగరంలో టిడిపి జిల్లా కార్యాలయం ఎదుట బాణాసంచా కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్, నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి , రాష్ట్ర కార్యదర్శి జెన్నీ రమణయ్య, తాళ్ళపాక అనురాధ, భూ లక్ష్మి, మైనుద్దిన్, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.










