Feb 17,2023 22:10

ఫొటో : మాట్లాడుతున్న కావలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు

టిడిపితోనే రాష్ట్రంలో సుపరిపాలన
ప్రజాశక్తి-కావలి : నారా చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలోని టిడిపి ప్రభుత్వంతోనే రాష్ట్రంలో సుపరిపాలన జరుగుతుందని కావలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు పేర్కొన్నారు. శుక్రవారం 40వ వార్డులో ఆయన ''ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి'' కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తెలుగు దేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. వార్డులోని ప్రజలు టిడిపి ఈసారి అధికారంలోకి వస్తుందని చెబుతూ.. మాలేపాటికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భగా ప్రతిఒక్కరితో మాట్లాడుతూ వార్డులోని సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వం వసూలు చేస్తున్న చెత్త పన్నుపై ప్రజలు మండిపడ్డారు. ఈ సందర్భంగా సుబ్బానాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముస్లిములకు రంజాన్‌ తోఫా, దుల్హన్‌ పథకాలు వంటి అద్భుతమైన పథకాలను అందించారని ప్రస్తుతమున్న వైసిపి ప్రభుత్వం ముస్లిములకు అన్యాయం చేసిందని తెలిపారు.
వైసిపి ప్రభుత్వంలో ఈ కావలి పట్టణంలో ఏ ఒక్క అభివృద్ధి పనైనా చేసారా అని ప్రశ్నించారు. నియోజకవర్గంలో రోడ్లు అస్తవ్యస్తం చేసి ఇసుక, గ్రావెల్‌ దోచుకోవటం సరిపోయిందని, కనీసం రోడ్డు వేసిన దాఖలాలు లేవని దుయ్యబట్టారు. రాష్ట్రంలో సైకో పాలన పోయి సైకిల్‌ పాలన రావాలని స్లోగన్లు వినిపించారు. వార్డులోని చిన్నారులకు చాక్లెట్లు పంచుతూ.. జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు మన్నవ రవిచంద్ర, మాజీ మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పోతుగంటి అలేఖ్య, పట్టణ ఉపాధ్యక్షులు గుత్తికొండ కిషోర్‌ బాబు, 40 వార్డు అధ్యక్షులు షేక్‌ రఫీ, వార్డు ముఖ్య నాయకులు రవి, కుందుర్తి కిరణ్‌ కుమార్‌, షేక్‌ మస్తాన్‌, తటవర్తి వాసు, గుండ్లపల్లి శివాజీ, మల్లి రమణయ్య, మంచాల ప్రసాద్‌, కావేటి చిన్న కోటయ్య, పోతుగంటి శ్రీకాంత్‌, మహామ్మద్‌ హుస్సేన్‌, సయ్యద్‌ ఇస్మాయిల్‌, నలమోతు శ్రీనివాసులు, గద్దెకొండయ్య, సుబ్బారావు, శేఖర్‌, కె.అశ్విని, షకీలా, లక్ష్మీదేవి, శారద, ఆనందమ్మ, మెహరున్నీసా, పఠాన్‌ అమీర్‌, గొట్టిపాటి రాము, అజరు, మనోహర్‌, నాయబ్‌ రసూల్‌, కాకుమాని మాల్యాద్రి, ఇస్మాయిల్‌, హుస్సేన్‌, బాలాజీ తదితరులున్నారు.