టిడిపితో పొత్తు శుభపరిణామం
ప్రజాశక్తి-ఉదయగిరి : జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ టిడిపితో పొత్తు శుభ పరిణామమని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జెడ్‌పి మాజీ చైర్మన్ పి.చంచలబాబు పేర్కొన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ టిడిపితో పొత్తుకు వెళదామని ప్రకటించడం స్వాగతిస్తున్నాం టిడిపి జనసేన పొత్తు రాష్ట్ర ప్రయోజనాలకు ఎంతో అవసరమని భవిష్యత్తులో అరాచక పాలన పోవాలంటే రాష్ట్రం అన్ని రంగాలలో ముందుకు పోవాలన్న ప్రాజెక్టులు కావాలన్నా పరిశ్రమలు రావాలన్నా టిడిపి అధికారం రావడం ఎంతైనా అవసరం ఉందన్నారు. పవన్ కళ్యాణ్ మాటలు టిడిపితో ఎటువంటి షరతులు లేకుండా పొత్తుకు పోదామని ప్రకటించడం చరితాత్మక ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలందరూ స్వాగతిస్తున్నారని కచ్చితంగా రాబోయేది తెలుగుదేశం, జనసేన ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.










