Dec 18,2022 21:48

పార్టీలోకి చేరిన వారితో 'కందికుంట'

ప్రజాశక్తి కదిరి టౌన్‌ : గాండ్లపెంట మండలం వేపరాలకు చెందిన వైసిపి సానుభూతిపరులు టిడిపిలోకి చేరారు. ఆదివారం పట్టణంలో టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛారి ్జకందికుంట వెంకట ప్రసాద్‌ సమ క్షంలో వారు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కందికుంట వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు తెలుగు యువత హిందూపురం పార్లమెంట్‌ సెక్రటరీ ఆంజనేయులు సభావత్‌ ఆధ్వర్యంలో గాండ్లపెంట మండలం వేపరాల గ్రామం నుంచి సుమారు 15 మంది వైసీపీ నాయకులు టిడిపిలో చేరారు. పార్టీలోకి చేరిన వారిలో వీరేంద్ర, గోపాల్‌, బాలు, ప్రసాద్‌, శేఖర, వెంకటప్ప, గణేష్‌, ఉపేంద్ర, మోహన, అంజి, తిరుపాల్‌, బాలాజీ, రవీంద్ర, సోమ్‌ శేఖర్‌ తదితరులున్నారు.