పార్టీలోకి చేరిన వారితో 'గుండుమల'
మడకశిర : మండల పరిధిలోని ఆమిదాల గొంది పంచాయితీ హెచ్‌ఆర్ పాళ్యం గ్రామానికి చెందిన పది కుటుంబాలు వైసిపిని వీడి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నాయి. వీరికి టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి టిడిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలోకి చేరిన వారు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి మడకశిర నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారని అన్నారు. ఆ అభివృద్ధిని చూసి తాము టిడిపిలో చేరామని ఈర పెన్నప్ప, హనుమంతరాయప్ప తదితరులు తెలిపారు. ఈకార్యక్రమంలో టిడిపి మండల నాయకులు రంగేగౌడు, ఎల్‌ఐసి రామచంద్ర, సిద్ధారెడ్డి, మాజీ సర్పంచి నాగరాజు, లోకేష్, మంజు, శివ, నాగన్న తదితరులు పాల్గొన్నారు.










