Sep 27,2023 18:54

వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

ప్రజాశక్తి - లింగసముద్రం : చంద్రబాబునాయుడు అరెస్టును ఖండిస్తూ బుధవారం మండల టిడిపి ఎస్సీ సెల్‌ అధ్యక్షులు తాళ్ళూరి ముసలయ్య ఆధ్వర్యలో తహశీల్దార్‌ మీరావళికి వినతిపత్రం అందజేశారు. చంద్రబాబునాయుడుని ప్రభుత్వం రాజకీయంగా అణిచివేయాలని అక్రమ కేసుపెట్టి ఇబ్బందులు పెడుతుందని టిడిపి నేతలు విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి ప్రధాన కార్యదర్శి పూరిమిట్ల మాల్యాద్రి, టిడిపి నాయకులు అంగులూరి కొండయ్య,చిరుతోటి బాలకోటయ్య,గాలంకి ప్రసాద్‌ పాల్గొన్నారు.