Feb 09,2023 20:01

కరపత్రాలు పంపిణీ చేస్తున్న రమేష్‌రెడ్డి

ప్రజాశక్తి-రాయచోటి : రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీలందరూ తెలుగుదేశం వైపు చూస్తున్నారని 2024 సార్వత్రిక ఎన్నికల్లో వారంతా సంపూర్ణ మద్దతు ఇస్తారని మాజీ ఎమ్మెల్యే ఆర్‌.రమేష్‌ కుమార్‌రెడ్డి తెలిపారు. గురువారం పట్టణంలోని 15, 14వ వార్డుల్లో టిడిపి శ్రేణులతో కలిసి రాష్ట్రానికి ఇదేమి కర్మ, రచ్చబండ అనే కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిడిపి ప్రతి ఏడాది ముస్లిం మైనార్టీలకు కేటాయించిన బడ్జెట్‌ పూర్తి స్థాయిలో ఖర్చు చేసిందన్నారు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు 2015-16 రూ.540 కోట్లు 2016-17కు రూ.710 కోట్లు, 2017-18 రూ.840 కోట్లు, 2018-19 రూ.1140 కోట్ల నిధులు కేటాయించిందని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన మైనార్టీలకు ఇచ్చామని తెలిపారు. దుల్హన్‌ పథకం ద్వారా పేద ముస్లిం యువతల వివాహాలకు ఒక్కొక్కరికి రూ.50 వేలు చెల్లించమన్నారు. విదేశీ విద్యోన్నతి పథకం ముస్లిం విద్యార్థులకు నైపుణ్యాలు పెంచేందుకు సిల్క్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా ప్రత్యేక శిక్షణలు ఇచ్చామని తెలిపారు. ఇమాములకు గౌరవేతనం, రంజాన్‌ నెలలో ముస్లింలకు మైనార్టీలకు రంజాన్‌ తోఫాతో పాటు మైనార్టీ కార్పొరేషన్‌ ద్వారా అర్హులైన పేదలకు స్వయం ఉపాధి పొందుటకు తక్కువ వడ్డీ శాతంతో రుణాలు అందజేశామని పేర్కొన్నారు. వైసిపి ప్రభుత్వం మైనార్టీల సంక్షేమాన్ని గాలికి వదిలి వారిని ఓటు బ్యాంకు చూసుకున్నారు తప్ప వారి అభివృద్ధి సంక్షేమానికి కృషి చేయలేదన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి కార్యదర్శి గాజుల ఖాదర్‌ బాషా, పట్టణ అధ్యక్షులు బోనమల ఖాదరవల్లి, రూరల్‌ అధ్యక్షులు మురికినాటి వెంకటసుబ్బారెడ్డి, రాజంపేట పార్లమెంట్‌ అధికార ప్రతినిధి వతన్‌ నిస్సార్‌, వీరభద్ర స్వామి గుడి మాజీ చైర్మన్‌ ఎద్దుల లక్ష్మీ ప్రసాద్‌, మాజీ కౌన్సలర్‌ మహబూబ్‌బాషా, న్యూ ఆంధ్ర ముబారక్‌, మదన, చరణ్‌, సహదేవ, మస్తాన్‌, శ్రీనివాసులు, పెంచలయ్య, పిరయ్య, పెంచలయ్య, చంద్రశేఖర్‌, జగదీష్‌, అన్నయ్య, వీరనాగయ్య, శ్రీనాద్‌, శశి, చలమయ్య, జగదీష్‌, అమావాస్య రెడ్డెయ్య, సోనిరాజ్‌ కలీమ్‌, బసయ్య, అత్తర్‌ జావిద్‌, మహబూబ్‌ అలీఖాన్‌, మీథేన్‌, శివారెడ్డి, దుర్గ, మన్సూర్‌, ఉమర్‌ ఫరూక్‌, కార్యకర్తలు పాల్గొన్నారు.