Sep 25,2023 18:52

నిరాహార దీక్షలు చేపట్టిన దృశ్యం

ప్రజాశక్తి -పొదలకూరు : అధినేత నారా చంద్రబాబునాయుడుకు న్యాయం జరిగే వరకూ పోరు ఆగదని పొదలకూరు మండల టిడిపి శ్రేణులు స్పష్టం చేశారు. చంద్రబాబును విడుదల చేయాలని కోరుతూ ఆ పార్టీ నేతలు సోమ వారం స్థానిక టిడిపి కార్యాలయంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. బాబుతో నేను' పేరుతో నిర్వహించిన రిలే నిరాహార దీక్ష మండలంలోని ప్రతి గ్రామం నుంచి టిడిపి నాయకులు, కార్యకర్తలు వచ్చారు. నల్ల జెండాలు పట్టుకొని 'సైకో పోవాలి - సైకిల్‌ రావాలి', 'డౌన్‌ డౌన్‌ జగన్‌' అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు తలచీరు మస్తాన్‌ బాబు ,పట్టణ అధ్యక్షుడు బొద్దులూరి మల్లికార్జున నాయుడు ,రైతు సంఘం నాయకులు భాస్కర్‌ రెడ్డి, మహిళా నాయకులు ఆదాల సుగుణమ్మ మాట్లాడారు. అధికార పార్టీ అరాచకాలను ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. టిడిపి నాయకులు రాష్ట్ర రైతు నాయకులు రావూరి రాధాకష్ణ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ అబ్జర్వర్‌ దావా పెంచలరావు, కలిచేటి ప్రభాకర్‌ రెడ్డి, రత్నం నాయుడు, అడపాల సుధాకర్‌ రెడ్డి, కర్రీయావుల శ్రీనివాసులు నాయుడు, హనుమారెడ్డి, కండే మస్తానయ్య, కష్ణ యాదవ్‌, రాజశేఖర్‌ రెడ్డి, వెంకట్‌ రెడ్డి, బోగోలు భాస్కర్‌ రెడ్డి, పెంచల్‌ నాయుడు, చిరంజీవి నాయుడు, ఆశీర్వాదం, కొంగి మస్తానమ్మ, వెంపులూరు అరుణ, కొంగి వెంకటరమణయ్య, దేవినేని శరత్‌ నాయుడు, నారప నాయుడు ఉన్నారు.