పుట్టపర్తి అర్బన్ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో టిడిపి మద్దతుదారుడు భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి విజయం పట్ల ి టిడిపి శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. శనివారం సాయంత్రం పట్టణంలోని హనుమాన్ సర్కిల్ లో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ పట్టణ కన్వీనర్ రామాంజనేయులు, నాయకులు ధారపనేని చంద్రశేఖర్, ఓబులేసు, సుబ్రహ్మణ్యం, ఊరు వాకిలి సురేష్, గుట్లపల్లి గంగాధర్, వెంకటేశు, సత్యనారాయణ, మాల మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
రొద్దం : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమి రెడ్డి రాంభూపాల్ రెడ్డి గెలవడంతో మండల కేంద్రంలో టిడిపి నాయకులు శనివారం సంబరాలు చేసుకున్నారు. టపాసులు కాల్చి నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా మహిళా అధ్యక్షురాలు సుబ్బరత్నమ్మ, పెనుకొండ నియోజకవర్గం అధ్యక్షులు చిన్నప్పయ్య, మండల కన్వీనర్ నరహరి, రొద్దం మాజీ సర్పంచి ఆశ్వర్థనారాయణ, హరీష్, మురళి, పవన్, సాయి కుమార్, చంద్ర శేఖర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
పెనుకొండ : పట్టణంలో టీడీపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి విజయం సాధించడం పట్ల పార్టీ నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మునిమడుగు చిన్నవెంకటరాముడు, సుబ్బరాయుడు, హుజూర్, పాలడుగు చంద్ర, సిద్దయ్య, బోయ నాగరాజు, బోయ గాయిత్రి తదితరులు పాల్గొన్నారు.
బుక్కపట్నం : పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి భూమి రెడ్డి రాంగోపాల్ రెడ్డి గెలుపుతో మండల కేంద్రంలో టిడిపి నాయకులు సంబరాలు చేసుకున్నారు. ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మల్ రెడ్డి, సాకే యశోద నాయుడు, లావణ్య గౌడ్, కాయగూరల చంద్ర తదితరులు పాల్గొన్నారు.
లేపాక్షి : పట్టభద్రుల టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్థి రామ్‌గోపాల్‌రెడ్డి విజయం పట్ల మండలం కేంద్రంలో టిడిపి నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జయప్ప, ఆనంద్ కుమార్, లలితమ్మ, నాగలింగారెడ్డి, మాలక్క, రమేష్, రవి ప్రభాకర్ రెడ్డి, చంద్ర తదితరులు పాల్గొన్నారు.
కొత్తచెరువు : పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా టిడిపికి చెందిన భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి గెలుపొందడం పట్ల టిడిపి నాయకులు హర్షం వ్యక్తం చేశారు నాలుగు రోడ్ల కూడలిలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా అధికార ప్రతినిధి ఎస్ శ్రీనివాసులు మండల కన్వీనర్ రామకృష్ణ, టౌన్ కన్వీనర్ వలిపి శ్రీనివాసులు, నాయకులు వెంకటరమణప్ప, రిటైర్డ్ టీచర్ నాగేందర్, ప్రసాదు తదితరులు పాల్గొన్నారు
పుట్టపర్తి రూరల్ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థులు విజయం సాధించడం పట్ల మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు విజయోత్సవాలను చేసుకున్నారు. మండల పరిధిలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, మామిళ్ళకుంట క్రాస్, పెడపల్లి తదితర గ్రామాల్లో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు టపాసులు కాల్చి బైక్ ర్యాలీలు నిర్వహించారు. ఇందులో భాగంగా పెడపల్లి గ్రామంలో తెలుగుదేశం నాయకులు శ్రీరామ నాయక్ , నిడిమామిడి మాజీ ఎంపీటీసీ ఎర్రప్ప, పైపల్లి సర్పంచి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. మామిల్లకుంట క్రాస్ సమీపంలో వెంకట గారి పల్లి సర్పంచి లక్ష్మీదేవి ఓబులేసు, ఉపేంద్ర, పుల్లప్ప, చంద్రశేఖర్ నాయుడు, ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సమీపంలో తెలుగు యువత నాయకులు అంబులెన్స్ రమేష్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు.
సోమందేపల్లి : మండల కేంద్రంలోని తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు స్థానిక పార్టీ కార్యాలయం నుండి ఎన్టీఆర్ సర్కిల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సిద్ధి లింగప్ప, నీరుగంటి చంద్ర, రామకృష్ణ, సూరి, అశ్వర్థ తదితరులు పాల్గొన్నారు.
ధర్మవరం టౌన్ : పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రామ్‌గోపాల్‌రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలుపొందడంపై ఆపార్టీ నాయకులు శనివారం సంబరాలు చేసుకున్నారు. ఇందులో భాగంగా పట్టణ ప్రధాన రహదారుల్లో టిడిపి శ్రేణులు బాణాసంచా పేల్చారు. అదేవిధంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఫణికుమార్, బీబీ, నాగూర్‌హుస్సేన్, రాళ్లపల్లి షరీఫ్, శీలామూర్తి, అంబటి సనత్, చిగిచెర్ల రాఘవరెడ్డి, దేవరకొండ రామకృష్ణ, కృష్ణాపురం జమీర్ అహమ్మద్, అత్తర్ రహీం, కరెంట్ ఆది, బొట్టు కిష్ట, గోసల శ్రీరాములు, గొట్లూరు రహీం, లోకేష్, కేతినేని రాజ, పాల్గొన్నారు.










