Aug 30,2023 22:57

ఇబ్రహీంపట్నంలో...

జగ్గయ్యపేట: ఇసుక అక్రమ రవాణాపై తెలుగుదేశం పార్టీ బుధవారం ఇబ్రహీంపట్నంలోని డిఎంజి కార్యాలయాన్ని ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి నెట్టేం రఘురాం, మండల పార్టీ అధ్యక్షులు కట్టా నరసింహారావు, రాష్ట్ర తెలుగు మహిళ నాయకురాలు ఆచంట సునీత, జిల్లా సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి కె శ్రీవాసరావులను హౌస్‌ అరెస్ట్‌ చేశారు.
కంచికచర్ల : ఇసుక సత్యాగ్రహం కార్యక్రమంలో భాగంగా ఇబ్రహీంపట్నంలో గల ఎపిఎండిసి ఎమ్‌డి కార్యాలయం ముట్టడికి వెళ్లకుండా టిడిపి నేతలను పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు.
తిరువూరు : ఇసుక మాటున ముఖ్యమంత్రి జగన్‌, అయన మంత్రు లు రూ.40 లక్షల కోట్లు దోపిడీ చేశారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వా మిదాస్‌ ఆరోపించారు. తిరువూరులోని తన నివాసంలో బుధవారం ఆపార్టీ నాయకులతో కలిసి ఆయన విలే కరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో టిడిపి సీనియర్‌ నాయకులు సుంకర కష్ణమోహనరావు, డాక్టర్‌ జయసింహా, షేక్‌ అబ్దుల్‌ హుస్సేన్‌, తేళ్ల పుష్పరాజ్‌, నాళ్లా సురేంద్ర, పర్వతం శ్రీనివాసరావ, తుమ్మలపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు. స్వామి దాస్‌ తో పాటు టిడిపి నియోజకవర్గ ఇన్‌ ఛార్జ్‌ శావల దేవదట్టును, పట్టణ అధ్యక్షులు బొమ్మసాని మహేష్‌ ను పోలీసులు గహ నిర్బంధించారు.
గంపలగూడెం : విజయవాడలో ఆందోళన చేపట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. ఆందోళనకు వెళ్ళనేకుండా పోలీసులు మంగళవారం రాత్రి నుండి తెలుగుదేశం నాయకుల ఇళ్ల వద్ద పహారా ఏర్పాటు చేశారు. ఎక్కడకక్కడ హౌస్‌ అరెస్టులు చేసి కార్యక్రమానికి వెళ్లనువ్వకుండా నిలుపుదల చేశారు.
ఇబ్రహీంపట్నం: అమరావతి వైకాపా నేతల అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా తెదేపా శ్రేణులు చేపట్టిన ఇసుక సత్యాగ్రహం మూడో రోజుకు చేరింది. ఎన్టీఆర్‌ జిల్లా గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును పోలీసులు అరెస్టు చేశారు. ఇబ్రహీంపట్నంలోని డైరెక్టర్‌ ఆఫ్‌ మైన్స్‌ అండ్‌ జియాలజీ ప్రధాన కార్యాలయాన్ని (డీఎంజీ) ముట్టడికి గురువారం తెదేపా పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా వైకాపా ఇసుక దోపిడీ గురించి తెదేపా సేకరించిన ఆధారాలను డీఎంజీ డైరెక్టరేట్‌కు సమర్పించి, వాటిపై తగిన చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేసేందుకు వెళ్లగా అరెస్టు చేశారు.
జగ్గయ్యపేట: అక్రమ ఇసుక రవాణాపై డి ఎం జి కార్యాలయానికి వెళ్లాలని పిలుపునిచ్చి నేపథ్యంలో వైసిపి ప్రభుత్వం తేదాపా నాయకులను హౌస్‌ అరెస్టు చేయడం దారుణం అని ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి నెట్టెం రఘురాం అన్నారు. బుధవారం ఆయన స్వగహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా రఘురాం మాట్లాడారు.