Dec 29,2022 21:46

కార్యకర్తల మృతికి నివాళులర్పిస్తున్న టిడిపి నాయకులు

            ప్రజాశక్తి-పెనుకొండ   నెల్లూరు జిల్లా కందుకూరులో టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు సభలో తొక్కిసలాట జరిగి 8 మంది కార్యకర్తలు మృతిచెందడం విచారకరమని టిడిపి జిల్లా అధ్యక్షులు బికె పార్థసారధి విచారం వ్యక్తం చేశారు. ఈమేరకు గురువారం పట్టణంలోని టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సంతాప సభలో ఆయన మాట్లాడుతూ టిడిపికి కార్యకర్తలే వెన్ను, దన్ను అన్నారు. అలాంటి కార్యకర్తలు మృతిచెందడం బాధాకరమన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అలాగే గాయపడిన కార్యకర్తలు త్వరగా కోలుకోవాలని కాంక్షించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అబ్జర్వర్‌ నరసింహయాదవ్‌, పార్లమెంట్‌ అధికార ప్రతినిధి రొద్దం నరసింహలు, పార్లమెంట్‌ కార్యనిర్వాహక కార్యదర్శి చిన వెంకటరాముడు, నియోజకవర్గ కమిటీ అధ్యక్షుడు చిన్నప్పయ్య పట్టణ అధ్యక్షుడు రవిశంకర్‌, మండల కన్వీనర్లు సిద్ధయ్య, సిద్ధలింగప్ప, పార్లమెంట్‌ అధికార ప్రతినిధి రఘువీర్‌చౌదరి, ఉపాధ్యక్షుడు రామలింగం, రాష్ట్ర టిఎన్‌టియుసి కార్యదర్శి పాలడుగు చంద్ర, రాష్ట్ర మైనార్టీ సెల్‌ అధికార ప్రతినిధి హుజూర్‌ ఉల్లాఖాన్‌, జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి జావేద్‌, పట్టణ ప్రధాన కార్యదర్శి వలీ పీర్‌,పట్టణ ఎస్టీ సెల్‌ అధ్యక్షుడు బాలు నాయక్‌, పట్టణ బీసీ సెల్‌ ఉపాధ్యక్షులు శ్రీహరి, శ్రీనివాసులు, ఎస్సీ సెల్‌ నియోజకవర్గ ఉపాధ్యక్షులు పెద్దన్న, కార్యదర్శి గొల్ల నాగరాజు, పట్టణ మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు సయ్యద్‌, మైనార్టీ సెల్‌ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు వాజిద్‌, మండల రైతుసంఘం అధ్యక్షుడు పోతిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.